సోమవారం 08 మార్చి 2021
National - Jan 28, 2021 , 13:44:23

గొర్రెల పెంపకందారులకు మంత్రి హరీశ్ అండ

గొర్రెల పెంపకందారులకు మంత్రి హరీశ్ అండ

సిద్దిపేట : గొర్రెల పెంపకందారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. గజ్వేల్- కోమటి బండ శివారులో గతేడాది ఆగస్ట్‌ 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో 117 గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయి. దీంతో గొర్రెలకు బీమా సౌకర్యం లేకపోవడంతో గొర్లకాపరులు జీవనోపాధి కోల్పోయి మంత్రి హరీశ్‌రావును కలిసి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన జాతీయ విపత్తు నిర్వహణ కింద ప్రతి గొర్రెకు దాదాపు రూ.3వేల చొప్పున్న ఎక్స్ గ్రేషియా మంజూరు చేయించారు. ఈ మేరకు గజ్వేల్ ఐఓసీలోని సీ బ్లాక్‌లో గురువారం ఆరుగురు బాధితులకు రూ.3.42లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. భిక్షపతి అనే రూ.78వేలు, శ్రీనివాస్‌కు రూ.90వేలు, రాములుకు రూ.57 వేలు, నర్సింలుకు రూ.45వేలు, కిష్టమ్మకు రూ.12వేలు, స్వామికి రూ.60వేల చొప్పున పరిహారం అందించారు. ఈ సందర్భంగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, పశు సంవర్ధకశాఖ శాఖ జిల్లా అధికారి సత్యప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

సామాజిక కార్యకర్తలకు సేవా శిరోమణి అవార్డుల ప్రదానం

కరోనా కష్టకాలంలో పేదలను, వలస కూలీలను ఆదుకున్న సామాజిక కార్యకర్తలకు సేవా శిరోమణి అవార్డులను మంత్రి హరీశ్ రావు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే మంచి పనులే శాశ్వతమన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో మంచి కార్యక్రమాలు చేపట్టారంటూ అభినందించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఆస్థి ఉన్నా మిగిలేది మంచి తనమేనని, జీవితం శాశ్వతం కాదని, ‌చేసిన మంచి పనులే శాశ్వతమని చెప్పుకొచ్చారు. సామాజిక కార్యకర్త విష్ణు జగతి, అతని బృందం సొంత డబ్బులు వెచ్చించి కరోనా సమయంలో పేదలు, వలస కూలీల ఆకలిని తీర్చారని కొనియాడారు. ఇక్కడ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గొల్ల కురుమల రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

VIDEOS

logo