వినూత్నమైన కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నారు ప్రశాంత్‌వర్మ. తాజాగా ఆయన మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సూపర్ హీరో కథాంశంతో ‘హను-మాన్’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రశాంత్‌వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదలచేశారు. ‘సూపర్ హీరో కథాంశంతో తెలుగులో రూపొందుతున్న తొలి సినిమా ఇది. భారతీయ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది.