HomeNationalMining Reforms Will Increase Employment Gdp
ఉపాధికి ఊతం
వృద్ధిరేటూ బలపడుతుంది
గనుల రంగంలో సంస్కరణలపై ఫిక్కీ
న్యూఢిల్లీ, మార్చి 20: గనుల రంగంలో చేపట్టే సంస్కరణలు.. దేశ జీడీపీ బలోపేతానికి, ఉద్యోగ-ఉపాధి కల్పనకు దోహదపడగలవని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ఆశయ సాధనకూ సాయపడుతాయన్నది. లోక్సభలో గనులు, ఖనిజ వనరుల అభివృద్ధి, నియంత్రణ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఫిక్కీ పైవిధంగా స్పందించింది. దేశ వృద్ధిరేటులో గనుల రంగం వాటా ఎప్పటికీ ప్రధానమైనదేనని ఫిక్కీ మైనింగ్ కమిటీ చైర్మన్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎండీ తుహిన్ ముఖర్జీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో గనుల రంగం కీలకమైనదని ఈ చట్ట సవరణలతో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిటీ కో-చైర్మన్, వేదాంత అల్యూమినియం, పవర్ విభాగం సీఈవో రాహుల్ శర్మ చెప్పారు.