మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 16:01:59

న్యూ ఇయ‌ర్ రోజున ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు!

న్యూ ఇయ‌ర్ రోజున ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు!

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీని చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఎముక‌లు కొరికే చలితో ఢిల్లీ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. డిసెంబ‌ర్ 31, జ‌న‌వ‌రి 1వ తేదీన సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు.. క‌నిష్ఠ స్థాయికి‌ ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. న్యూ ఇయ‌ర్ రోజున ఢిల్లీలో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌లు డిసెంబ‌ర్ 27 వ‌ర‌కు ఇలానే కొన‌సాగ‌నున్నాయి. బుధ‌వారం లోధి రోడ్‌లో అత్య‌ల్పంగా 3.7 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఇది సాధార‌ణం కంటే త‌క్కువ‌. ఆదివారం రోజు 3.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, ఈ సీజ‌న్‌లో ఇదే అత్య‌ల్పం అని అధికారులు చెప్పారు. 

మంగ‌ళ‌వారం నాడు స‌ఫ్ద‌ర్‌జంగ్ అబ్జ‌ర్వేట‌రీలో క‌నిష్ఠంగా 5.3 డిగ్రీల సెల్సియ‌స్‌, గ‌రిష్ఠంగా 23.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. సోమ‌వారం 5.5 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయిన‌ట్లు అధికారులు తెలిపారు.