ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 21, 2020 , 14:00:40

మండీల‌కు వ్య‌తిరేకం కాదు.. ఎంఎస్‌పీ కొన‌సాగుతుంది : ప‌్ర‌ధాని మోదీ

మండీల‌కు వ్య‌తిరేకం కాదు.. ఎంఎస్‌పీ కొన‌సాగుతుంది : ప‌్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: కొత్త‌గా పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశపెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుల ద్వారా రైతులు మ‌రింత బలోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.  బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు.  నిన్న పార్ల‌మెంట్లో రెండు వ్య‌వ‌సాయ బిల్లులు పాస‌య్యాయ‌ని, ఈ సంద‌ర్భంగా రైతుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. వ్య‌వ‌సాయ రంగంలో మార్పు అవ‌స‌ర‌మ‌ని, రైతుల కోస‌మే త‌మ ప్ర‌భుత్వం ఈ సంస్క‌ర‌ణ తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాని అన్నారు. కొత్త బిల్లుల‌తో త‌మ పంట‌ను ఎక్క‌డైనా అమ్ముకునే అధికారం రైతుల‌కు ఉంటుంద‌న్నారు. అయితే ఈ బిల్లులు వ్య‌వ‌సాయ మండీల‌కు వ్య‌తిరేకం కాదు అని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఉన్న‌ట్లుగానే ఇక ముందు కూడా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కొన‌సాగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ వేళ రికార్డు స్థాయిలో గోధుమ‌లు కొనుగోలు చేసిన‌ట్లు చెప‌పారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూపంలో సుమారు ల‌క్షా 13వేల కోట్ల ను రైతుల‌కు అంద‌జేశామ‌న్నారు.గ‌త ఏడాది క‌న్నా ఇది 30 శాతం ఎక్కువే అన్నారు.