మరిన్ని ప్రాంతీయ భాషల్లో " మైండ్ వార్స్" సేవలు

బెంగళూరు : భారతదేశంలో అతి పెద్ద నాలెడ్జ్ డేటాబేస్‌ని సృష్టించేందుకు ఏప్రిల్ 2019లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ద్వారా జీ5 ఫ్లాట్‌ఫామ్ పై మైండ్వార్స్ అనే ఇంటిగ్రేటెడ్ యాప్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైనవి పంచుకునేలా గేమిఫైబుల్ అనుభూతి ద్వారా నాలెడ్జ్ పొందడంతోపాటు, మందకొడి అనే భావనకు చెల్లుచీటి పలుకాలనే లక్ష్యాన్ని మైండ్ వార్స్ కలిగి ఉన్నది. ఇండియాని స్మార్టర్‌గా మార్చేందుకు అవసరమయ్యే నాలెడ్జ్‌ని మెరుగుపరిచే మార్గాలను బలోపేతం చేయడానికి మైండ్ వార్స్ తన భాషా పోర్టుఫోలియోను హిందీ ,ఇంగ్లిష్‌తోపాటు ఆరు ప్రాంతీయ భాషలైన తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, బంగ్లా , కన్నడంలో అందిస్తున్నది.
మైండ్ వార్స్ యాప్‌పై మాతృభాషలో లభించే కంటెంట్ తో విద్యార్ధుల నాలెడ్జ్‌ని పెంచుతుంది. దీని ఫలితంగా, ఇది వారి స్కూలు,భాషతో సంబంధం లేకుండా జాతీయ ఫ్లాట్‌ఫారంపై తన తోటివారితో పోటీపడేందుకు, చిట్టచివరికి టివి క్విజ్ షోలో భాగం అయ్యే అవకాశాన్ని ప్రతి విద్యార్ధి దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. “మైండ్ వార్ ఫ్లాట్‌ఫారంపై విద్యార్ధుల కొరకు కొత్త సవాళ్లు, డెవలప్మెంట్లు ప్రోత్సాహాలతో 2020 అద్భుతమైన సంవత్సరంగా నిలుస్తుంది. ఇంగ్లిష్ , హిందీకి అదనంగా మరో 6 భాషల్లో కంటెంట్ అనువదించడంతో, మన దేశవ్యాప్తంగా మరింత మంది విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని" జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ కుమార్ బన్సాల్ తెలిపారు.
తాజావార్తలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి