ఆన్లైన్ జీకె ఒలింపియాడ్‌ను ఆవిష్కరించిన మైండ్ వార్స్

బెంగళూరు : విద్యార్థుల కోసం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోన్న బహుళ వేదికల జ్ఞాన కార్యక్రమం "మైండ్ వార్స్," భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ 2020ను ప్రకటించింది. దీనిద్వారా అత్యుత్తమ భవిష్యత్ ను చేరుకునే దిశగా విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా చేసుకున్నది. జాతీయ స్థాయి చాంఫియన్‌షిప్ నవంబర్ 2020న ప్రారంభం కానుంది. ఇది నాల్గవ తరగతి విద్యార్థులు మొదలు 12 వ తరగతి విద్యార్థుల వరకూ భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థ ల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో ఆసక్తికరమైన సాధారణ అవగాహన ప్రశ్నలు అంటే తరగతికి 5 అంశాలుంటాయి. తద్వారా రాబోయే సంవత్సరాలలో విద్యార్థుల సామర్థ్యం, వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాదు, దీనిని భారతదేశ వ్యాప్తంగా 5వేలకు పైగా పాఠశాలల్లోని ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులను సవివరంగా సర్వే చేసి సూత్రీకరించారు.
ఈ ఒలింపియాడ్ కోసం విద్యార్థులు 24 గంటలూ పాల్గొనవచ్చు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జాతీయ చాంపియన్‌గా గుర్తింపుతో పాటు ఒక కోటి రూపాయల వరకూ బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు https://www.mindwars.co.in/olympiad/ చూడొచ్చు.ఈ ఒలింపియాడ్ 2020 గురించి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ కెఆర్ బన్సాల్ మాట్లాడుతూ ‘‘జాతీయ స్థాయి జీకె ఒలింపియాడ్ కార్యక్రమం పాఠశాల విద్యార్థులు తమ సమస్యా పూరణ నైపుణ్యం వృద్ధి చేసుకోవడంలో సహాయపడటంతో పాటు టైమ్ మేనేజ్మెంట్ చేయడంలోనూ సహాయపడుతుంది. అదే రీతిలో పోటీతత్త్వపు అనుభవాలను అందించడం వల్ల తమ కెరీర్ ప్రాధాన్యతలను ఎంచుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము విజయవంతమైన విద్యార్థులను బహుళ దశలలో గుర్తించడంతో పాటుగా పాఠశాల స్థాయి, రాష్ట్ర స్థాయిలో బహుమతులను అందించనున్నాం" అని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి