శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 19:38:24

14 రోజులు ఇంట్లోనే ఎంపీ మిమీ చక్రవర్తి..!

14 రోజులు ఇంట్లోనే ఎంపీ మిమీ చక్రవర్తి..!

కోల్‌కతా: కరోనా పరిస్థితుల నేపథ్యంలో తాను 14 రోజులు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి తెలిపారు. బాజి సినిమా షూటింగ్‌ కోసం చిత్రయూనిట్‌తో కలిసి లండన్‌ వెళ్లిన మిమీ చక్రవర్తి మంగళవారం కోల్‌కతాకు వచ్చింది. ఎన్‌ఎస్‌సీబీఐ ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌, ఇతర కరోనా సంబంధిత పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు తాను 14 రోజులపాటు ఇంటికే పరిమితమవుతానని, ఎవరినీ కలవనని స్పష్టం చేశారు.

యూకే, దుబాయ్‌ మీదుగా ఇంటికి తిరిగొచ్చాను. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. నన్ను కలవొద్దని బంధువులకు చెప్పాను.  చాలా మంది సుమారు 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలంటున్నారు. మా నాన్న 65ఏళ్లకు పైబడి ఉంటారు. తొలి ఏడు రోజులు ఇంట్లోనే ఉంటానని చెప్పారు మిమీ. ప్రభుత్వాదేశాల మేరకు అందరూ పరిశుభ్రతను పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు, ప్రజలకు సూచించారు.  logo