శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 15:05:04

పాల వ్యాపారి భౌతిక దూరం భలే ఉంది కదా..

పాల వ్యాపారి భౌతిక దూరం భలే ఉంది కదా..

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు కోడై కూస్తున్నారు. ఈ క్రమంలో తమకు తాము రక్షణ కల్పించుకుంటూ.. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఓ పాల వ్యాపారి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. తన పాల బండికి పైపును అమర్చి ఫనెల్‌ సహాయంతో పాలు విక్రయిస్తున్నాడు. పాల వ్యాపారి మాస్కుతో హెల్మెట్‌ ధరించాడు. చేతులకు గ్లౌస్‌లు ధరించి తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు పాల వ్యాపారి.

ఈ దృశ్యాన్ని అహ్మదాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ నితిన్‌ సంగ్వాన్‌ చిత్రీకరించి ట్వీట్‌ చేశారు. కొంత మంది తమకు తామే రక్షణ కల్పించుకుంటూ.. ఇతరులకు కూడా రక్షణగా నిలుస్తున్నారని ట్వీట్‌లో ఐఏఎస్‌ అధికారి పేర్కొన్నారు. మీరు పాల వ్యాపారిలా వినూత్న ఆలోచనలు చేయలేకపోయినా సరే.. కనీసం ఇంట్లోనైనా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి అని ఆ అధికారి సూచించారు. logo