మంగళవారం 26 జనవరి 2021
National - Dec 26, 2020 , 08:36:25

పోషియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

పోషియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని పోషియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. శుక్రవారం దక్షిణ కాశ్మీర్‌లోని పోషియాన్‌లోని కనిగమ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారని ఆర్మీ అధికారి తెలిపారు. సెక్యూరిటీ ఫోర్స్‌ వెంటనే ప్రతి కాల్పులకు దిగిందని, కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడని తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని, వారిని హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 


logo