గురువారం 26 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 13:48:06

ఉగ్రస్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఉగ్రస్థావరాన్ని ఛేదించిన భద్రతా దళాలు.. భారీగా ఆయుధాలు స్వాధీనం

రాజౌరీ : జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా గంభీర్ మొఘ్లాన్ సమీప  అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి. భారీగా ఆయుధాలను, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.  అటవీ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలున్నాయన్న సమాచారం మేరకు జమ్ముకశ్మీర్‌ పోలీసులు, 38 రాష్ట్రీయ రైఫిళ్లు శుక్రవారం సంయుక్త తనిఖీ ఆపరేషన్‌ చేపట్టాయి.

భూమి కింద రాతి కట్టడంలో దాచిన రెండు ఆటోమెటిక్‌ ఏకే-47 రైఫిళ్లు, రెండు ఏకే -47 మ్యాగజైన్లు, 270 బుల్లెట్లు, 2 చైనీస్‌ పిస్టళ్లు, రెండు పిస్టళ్ల మ్యాగజైన్లు, 75 పీకా రౌండ్లు, 12 బ్లాంక్‌ రౌండ్లు, 10 డిటోనేటర్లు, 5 నుంచి 6 కిలోల పేలుడు పదార్థాల సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు రాజౌరీ సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) చందన్‌ కోహ్లి తెలిపారు. మంజకోట్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లోనూ తనిఖీ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.