మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 10:48:11

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ : బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధరలో స్వల్ప మార్పులు జరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం 40 రూపాయలు పెరిగి రూ. 47,250కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 పెరిగి రూ.48,450గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.39౦ పెరిగి కేజీ వెండి రూ.48,500 నమోదు అయింది. హైదారాబాద్‌లో 22 క్యారెట్లు రూ.40 పెరిగి రూ. 46,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.40 పెరిగి రూ.50 వేల మార్కును దాటి రూ.50,660 వద్ద నిలిచింది.

ఇక విజయవాడలో బంగారం ధరలు కూడా హైదరాబాద్‌లో ఉన్న విధంగానే ఉన్నాయి. ఇవి కేవలం మంగళవారం నాటి ధరలు మాత్రమే. బంగారం డీమాండ్‌, స్థానిక పరిస్థితులను బట్టి ధరలు మారే అవకాశం ఉంది.


logo