బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 13:38:58

మధ్యప్రదేశ్‌లో స్వల్ప భూ ప్రకంపనలు

మధ్యప్రదేశ్‌లో స్వల్ప భూ ప్రకంపనలు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో బుధవారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి  కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.3గా నమోదైందని భారత వాతావరణ శాఖ భోపాల్‌ కేంద్ర శాస్త్రవేత్త వేద ప్రకాశ్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ కంపం సంభవించిందని, 15 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం నిక్షిప్తమై ఉందని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలోని పట్టణ శివారు దుండ ప్రాంతంలో ప్రకంపనల కారణంగా జనాలు మేల్కొని ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.  సియోని జిల్లాకు 96 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను ప్రకంపనలు తాకాయని అధికారులు తెలిపారు. ప్రకంపనల కారణంగా ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.