శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 18, 2020 , 21:06:25

ఉచిత నిధుల సమీకరణను పరిచయం చేసిన మిలాప్‌

 ఉచిత నిధుల సమీకరణను పరిచయం చేసిన మిలాప్‌

చెన్నై:ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ సంస్థ మిలాప్‌ వినూత్న పథకాన్ని అందిస్తున్నది.  వచ్చే పండుగ సీజన్‌ వరకూ జీరో పర్సెంట్ ప్లాట్‌ఫామ్‌ ఫీజును పరిచయం చేసింది. ఈ సమయంలో, మిలాప్‌ ఉచిత ప్లాట్‌ఫామ్‌ మరింత మంది ప్రజలకు చేరువ కావడంతో పాటు వీలైనంత త్వరగా ప్రత్యక్ష సహాయాన్ని అవసరార్థులు పొందగలరు. ‘‘గత కొద్ది నెలలుగా, కోవిడ్‌ –19 మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. ప్రజల నుంచి అపూర్వమైన ఔదార్యాన్ని మేము చూశాము.

వేలాది మంది మిలాప్‌పై నిధులను సమీకరించడంతో పాటుగా ఆపదలో ఉన్న లక్షలాది మందికి సహాయపడ్డారు. మేము మిలాప్‌ను అన్ని సహాయసంబంధిత అంశాలకు నిధుల సేకరణకు కృతజ్ఞతా చిహ్నంగా ఉచితంగా అందిస్తున్నాం. అందువల్ల, వచ్చే పండుగ సీజన్‌ వేళ ఫండ్‌రైజర్లందరికీ 0% ఫీజు ను విస్తరించడంపై దృష్టి పెట్టాము’’ అని మిలాప్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో మయూఖ్‌ చౌదరి అన్నారు.


తాజావార్తలు


logo