బుధవారం 27 మే 2020
National - May 15, 2020 , 12:45:41

ఏపీ సరిహద్దుల్లో నిలిచిపోయిన వలసకార్మికులు

ఏపీ సరిహద్దుల్లో నిలిచిపోయిన వలసకార్మికులు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులు అశ్వారావుపేట వద్ద ఉన్న సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భారీసంఖ్యలో నిలిచిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరిన వాహనదారులను ఆ రాష్ట్ర అధికారులు చెక్‌పోస్టువద్ద అడ్డుకుంటున్నారు. దీంతో సుమారు రెండు వేలకుపైగా కార్మికులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో అశ్వారావుపేట చెక్‌పోస్టువద్ద నిలిచిపోయారు. అయితే కార్మికులు భారీ సంఖ్యలో ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వారిని వీలైనంత తొందరగా అక్కడి నుంచి తరలించాలని అధికారులను కోరుతున్నారు. 


logo