గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 20:33:34

మా బ‌స్సులు అద్దెకు తీసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు...

మా బ‌స్సులు అద్దెకు తీసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు...

బెంగ‌ళూరు:  చెల్లింపు ప్రాతిపా‌దిక‌న ప్ర‌భుత్వ ర‌హ‌దారి ర‌వాణా సంస్థ బ‌స్సుల‌ను అద్దెకు తీసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. త‌మ రాష్ట్రంలో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికులు, యాత్రికులు, ప‌ర్యాట‌కులు, విద్యార్థులు, ఇత‌ర వ్య‌క్తులు సంబంధిత స్థానిక నోడ‌ల్ అధికారి అనుమ‌తి తీసుకుని ఈ బ‌స్సులు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంత‌ర్‌రాష్ట్ర ప్ర‌యాణానికి నోటిఫైడ్ పాయింట్ల వ‌ద్ద రాక‌, పోక‌ల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. శ్రామిక్ రైళ్ల ద్వారా కూడా రాష్ట్రంలో చిక్కుకుపోయిన బీహార్‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌కు వ‌ల‌స కార్మికుల‌ను చేర‌వేస్తున్నారు. రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అనిల్ కుమార్ మాట్లాడుతూ... పేమెంట్ ప్రాతిపాదిక‌న ఈ స‌దుపాయంను రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేష‌న్‌, కేఎస్ ఆర్టీసీ, ఎన్‌డ‌బ్య్లూ కెఆర్‌టీసీ, ఎన్‌కేఆర్‌టీసీ, బీఎమ్‌టీసీ బ‌స్సుల ద్వారా క‌ల్పిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం అనుమ‌తించిన ప‌రిశ్ర‌మ‌ల‌కు కార్మికుల‌ను చేర‌వేయ‌డానికి ఈ సౌక‌ర్యం వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు. 


logo