గురువారం 28 మే 2020
National - May 20, 2020 , 12:06:29

పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి.. వీడియో

పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి.. వీడియో

న్యూఢిల్లీ : ఢిల్లీ - గురుగ్రామ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో విధుల్లో ఉన్న గురుగ్రామ్‌ పోలీసులపై వలస కార్మికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులను అసభ్యకర పదజాలంతో దూషించారు. హర్యానాలోని ఉద్యోగ్‌ విహార్‌ ఏరియాలో పరిశ్రమలను తెరవడంతో.. ఢిల్లీలోని వలస కూలీలు.. గురుగ్రామ్‌కు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. అయితే వందలాది మంది వలస కూలీలను గురుగ్రామ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కూలీలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఢిల్లీ పోలీసులు కూలీలకు అనుమతి ఇవ్వకపోయి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని గురుగ్రామ్‌ పోలీసులు అన్నారు. ఈ ఘటనపై గురుగ్రామ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 


logo