శనివారం 11 జూలై 2020
National - Jun 05, 2020 , 15:50:01

బోల్తాపడ్డ బస్సు.. 37 మందికి గాయాలు

బోల్తాపడ్డ బస్సు.. 37 మందికి గాయాలు

లక్నో: లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తున్నప్పటికీ దేశంలో వలస కూలీల కష్టాలు తీరడం లేదు. వలస వెళ్లిన ప్రాంతాల నుంచి రైళ్లతోపాటు వివిధ వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్న కార్మికులు మార్గమధ్యలోనే ప్రమాదాల బారిన పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడగా, మరో 25 క్షతగాత్రులయ్యారు. 

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న ఇటుక బట్టీల్లో పనిస్తున్న 37 మంది వలస కార్మికులు ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్‌కు ప్రైవేటు బస్సులో వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సమీపంలో బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 35 మంది గాయపడ్డారు. సమీపంలో గ్రామస్తులు వారిని బస్సులోనుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.  గాయపడినపడిన జిల్లా దవాఖానకు తరలించారు. అతివేగంగా వచ్చిన బస్సు మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిందని,  గురువారం  అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.


logo