బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 15:58:13

పేర్లు లేకున్నా రైల్వేస్టేషన్‌కు..బాంద్రాలో కార్మికుల రద్దీ..వీడియో

పేర్లు లేకున్నా రైల్వేస్టేషన్‌కు..బాంద్రాలో కార్మికుల రద్దీ..వీడియో

ముంబై:లాక్‌డౌన్‌ ప్రభావంతో వివిధ రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకున్న విషయయం తెలిసిందే. అయితే కేంద్రప్రభుత్వం ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0 కొనసాగిస్తూ కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వేశాఖ అధికారులు బీహార్‌ వలస కార్మికుల కోసం బాంద్రా నుంచి శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌ ను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ముందుగా పేర్లు నమోదుచేసుకున్నవారు మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..బాంద్రా టర్మినస్‌కు మాత్రం పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు.

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో పేర్లు లేని వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేవలం 1000 మందికి మాత్రమే రైలులో వెళ్లేందుకు అనుమతి ఉండగా..ఊహించని రీతిలో కార్మికులు వచ్చే సరికి పరిస్థితి అదుపుతప్పింది. కార్మికులను తిరిగి బయటకు పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. వేల సంఖ్యలో కార్మికులతో బాంద్రా రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోయిందని పశ్చిమరైల్వే సీపీఆర్‌వో  రవిందర్ భకర్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo