గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 16:04:31

బారికేడ్లు తొలగించి చొచ్చుకొచ్చిన వలసకార్మికులు..వీడియో

బారికేడ్లు తొలగించి చొచ్చుకొచ్చిన వలసకార్మికులు..వీడియో

యూపీ: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వలసకార్మికులు, కూలీలు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, పరిమిత స్థాయిలో రైళ్లు నడుస్తుండటంతో కాలినడకన సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నారు.

ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దు లోని ఛాక్ ఘాట్ ఏరియాలో మీదుగా కార్మికులు యూపీలోకి ప్రవేశించారు. భారీ సంఖ్యలో కార్మికులు వచ్చి..పోలీసులు రహదారిపై పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. రద్దీ ఎక్కువుండటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo