బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 18:33:15

కార్మికుల‌కు స‌రైన ఆహారం, వ‌స‌తి లేదు: మాయావ‌తి

కార్మికుల‌కు స‌రైన ఆహారం, వ‌స‌తి లేదు: మాయావ‌తి

యూపీ: లాక్ డౌన్ తో యూపీలో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల ప‌ట్ల రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు స‌రిగా లేద‌ని బహుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావ‌తి అన్నారు. మాయావ‌తి మీడియాతో మాట్లాడుతూ..రెక్కాడితే కానీ డొక్కాడ‌ని వ‌ల‌స కార్మికులు తీవ్ర‌మైన దు:ఖ‌ంలో ఉన్నారన్నారు.

ప్ర‌భుత్వాలు కార్మికులు,కూలీల‌కు అవ‌స‌ర‌మైన ఆహారం, వ‌స‌తి ఏర్పాటు చేయ‌లేద‌ని ఆరోపించారు. కార్మికులు ఇబ్బంది ప‌డ‌కుండా వారికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రప్ర‌భుత్వం ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ల‌లో సొంతూళ్ల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo