బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 18:22:48

క్వారంటైన్ సెంట‌ర్ వ‌ద్ద ‌వ‌ల‌స‌కార్మికుడు ఆత్మ‌హ‌త్య‌..!

క్వారంటైన్ సెంట‌ర్ వ‌ద్ద ‌వ‌ల‌స‌కార్మికుడు ఆత్మ‌హ‌త్య‌..!

ఒడిశా : మ‌యూర్‌భంజ్ జిల్లాలోని క్వారంటైన్ సెంట‌ర్ వ‌ద్ద విషాదం చోటుచేసుకుంది. సురేంద్ర బెహెరా అనే వ‌ల‌స కార్మికుడు క్వారంటైన్ కు స‌మీపంలో ఉన్న చెట్టుకు త‌న లుంగీతో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సురేంద్ర బెహెరా త‌న భార్యతో క‌లిసి ఏపీలోని విజ‌య‌వాడ నుంచి 6 రోజుల క్రితం వ‌చ్చాడు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రినీ క్వారంటైన్ సెంట‌ర్ లో ఉంచాం. అయితే సురేంద్ర బెహెరా ఓ చెట్టుకు వేలాడుతూ విగ‌త జీవిగా క‌నిపించాడు.  అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని ఉన్న‌తాధికారి లక్ష్మీధ‌ర్ స్వెయిన్ వెల్ల‌డించారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo