గురువారం 04 జూన్ 2020
National - May 16, 2020 , 15:29:11

సైకిల్‌ దొంగిలించాడు.. క్షమించమని లేఖ రాశాడు!

సైకిల్‌ దొంగిలించాడు.. క్షమించమని లేఖ రాశాడు!

లాక్‌డౌన్ ప్ర‌క‌టించి రెండు, మూడు నెల‌లు అవుతున్నా వ‌ల‌స కార్మికులు క‌ష్టాల్లో ఎలాంటి మార్పులు లేవు. త‌మ సొంత‌గూటికి చేరుకోవ‌డానికి కాలిన‌డ‌కతో వంద‌ల కి.మీ. న‌డుస్తున్నారు. దూర‌ప్రాంతాల్లో ఉండేవాళ్ల‌కి సొంత వాహ‌నాలు లేక బ‌లైపోతున్నారు. ఇటీవ‌ల ఓ వ‌ల‌స‌కార్మికుడు ఇంటికి వెళ్ల‌డానికి సైకిల్‌ను దొంగిలించాడు. క్ష‌మించ‌మ‌ని య‌జ‌మానిని కోరుతూ ఓ లేఖ కూడా రాశాడు.

భ‌ర‌త్పూర్ జిల్లాలోని రారా గ్రామానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్ అనే వ్య‌క్తి స‌హ‌బ్ సింగ్ ఇంటి నుంచి సైకిల్ దొంగిలించాడు. సింగ్ త‌న ఇంటి వ‌రండాను శుభ్రం చే్స్తున్న‌ప్పుడు అక్క‌డ ప‌డిఉన్న లేఖ క‌నిపించింది. అందులో 'నేను ఒక కూలిని. ఇంటికి వెళ్ల‌డానికి నాకు సొంత వాహ‌నం లేదు. 250 కి.మీ. దూరంలో ఉన్న‌ బ‌రేలికి వెళ్లాలి. ఇంటి ద‌గ్గ‌ర నా పిల్ల‌లు ఎదురుచూస్తున్నారు. ఈ సైకిల్ న‌న్ను గ‌మ్యాన్ని చేరుస్తుంద‌ని అనుకుంటున్నాను. మీ అనుమ‌తి లేకుండా తీసుకెళ్తున్నందుకు న‌న్ను క్ష‌మించండి అని హీందీలో రాసి ఉన్న లేఖ‌ను చ‌దివాడు య‌జ‌మాని. లాక్‌డౌన్‌లో త‌ను చేయ‌లేని ప‌ని సైకిల్ చేసింద‌ని య‌జ‌మాని సంతోషించాడు.


logo