బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 10:24:45

మార్గమధ్యలో స్నేహితుడి ఒడిలో అసువులు బాసిన వలస కూలీ

మార్గమధ్యలో స్నేహితుడి ఒడిలో అసువులు బాసిన వలస కూలీ

భోపాల్‌ : వలస కూలీల మరో విషాద ఘటన. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు వలస కూలీలు గుజరాత్‌లోని సూరత్‌లో గల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపు నేపథ్యంలో స్వస్థలాలకు తిరుగుబాట పట్టారు. అమ్రిత్‌ అతడి స్నేహితుడు ఉత్తరప్రదేశ్‌కు చేరుకునేందుకు ఇండోర్‌కు చెందిన ఓ ట్రక్కును ఆశ్రయించారు. రూ. 4 వేలు చెల్లించి అదీ నిలబడి ట్రక్కు వెనకభాగంలో ప్రయాణించేలా ఒప్పందంపై. మార్గం మధ్యంలో అమ్రిత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో శివపురి జిల్లా సమీపంలో ట్రక్కు నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అతనితో పాటుగా స్నేహితుడు యాకూబ్‌ దిగాడు. అస్వస్థత కారణంగా అమ్రిత్‌ స్నేహితుడి ఒడిలో ఒరిగాడు. రోడ్డు వెంబడి వెళ్తున్న వారిని సహాయం చేయాల్సిందిగా యాకూబ్‌ ఎంతగా ప్రాధేయపడ్డా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఘటననంతా స్థానికొడకరు చిత్రించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. సాయం అందేలోపే అమ్రిత్‌ ప్రాణాలు విడిచాడు. అమ్రిత్‌కు తీవ్ర జ్వరం, వాంతులు కావడంతో గుండె సంబంధ సమస్యతో మృతిచెందినట్లు సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ పీ.కే.ఖరే తెలిపారు. ఏదిఏమైనా కోవిడ్‌-19 పరీక్ష ఫలితాలు రాగానే స్పష్టత వస్తుందన్నారు. యాకూబ్‌ను సైతం క్వారంటైన్‌కు పంపించినట్లు తెలిపారు. ఇతడి ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. logo