సోమవారం 06 జూలై 2020
National - May 24, 2020 , 12:18:41

100 కి.మీ. నడిచి గర్భిణి ప్రసవం.. శిశువు మృతి

100 కి.మీ. నడిచి గర్భిణి ప్రసవం.. శిశువు మృతి

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు పడరాని కష్టాలు పడుతున్నారు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం రాత్రింబవళ్లు కష్టపడే కార్మికుల బాధలు వర్ణణాతీతం. ఓ గర్భిణి సొంతూరికి వెళ్లే క్రమంలో.. 100 కిలోమీటర్లు నడిచి ప్రసవించింది. పుట్టిన బిడ్డ క్షణాల్లోనే కన్నుమూసింది. దీంతో ఆ దంపతులిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. 

బీహార్‌కు చెందిన ఇద్దరు దంపతులు రామ్‌, బిందియా.. పొట్టకూటి కోసం గతేడాది పంజాబ్‌లోని లుధియానాకు వెళ్లారు. లాక్‌డౌన్‌తో కాలినడకన స్వస్థలానికి బయల్దేరారు దంపతులు. బిందియా ప్రస్తుతం గర్భిణి. హర్యాణాలోని అంబాలా చేరుకోగానే బిందియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన కొద్దిసేపటికే బిడ్డ మృతి చెందింది. తమకు సంతానం కలిగిందనే సంతోషం.. క్షణాల్లోనే ఆవిరైపోయింది. అంబాలాలోనే శిశువుకు అంత్యక్రియలు చేశారు తల్లిదండ్రులు. 


logo