సోమవారం 01 జూన్ 2020
National - May 23, 2020 , 12:29:13

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

వలస కూలీల బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్‌: వలసకూలీలకు ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటకలో చిక్కుకున్న వలసకూలీలతో బెంగళూరు నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరిన బస్సుకు శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ మంటలను ముందే గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ ప్రయాణికులను కిందకు దించిన కాసేపటికే బస్పు పూర్తిగా దగ్ధమైంది. 

గుజరాత్‌లోని ఖేడా పట్టణానికి సమీపంలో మక్వా గ్రామం వద్ద అహ్మదాబాద్‌ - వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 28 మంది ఉన్నారు. డ్రైవర్‌ మంటలను గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యమైనా 28 మంది అగ్నికి ఆహుతయ్యేవారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo