బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 06:09:16

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జార్ఖండ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిర్భూం జిల్లా నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైల్వే ట్రాక్‌ మీదుగా బయల్దేరిన కార్మికులు పూర్వబర్ధమాన్‌ జిల్లాలోని తారాపీఠ్‌ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి నదిపై గల వంతెన మీదుగా నడుస్తుండగా, ఎదురుగా జార్ఖండ్‌లోని పాకూర్‌ నుంచి వస్తున్న ఇన్స్‌పెక్షన్‌ వ్యాన్‌ డ్రైవర్‌ ట్రాక్‌పై వారిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి వ్యాన్‌ ఆపేశాడు. దీంతో వలస కార్మికులు ప్రణాలతో బయటపడ్డారు. మే 7 ఉదయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో పట్టాలపై నిద్రిస్తున్న 16 మంది వలస కూలీలపైనుంచి గూడ్సు రైలు వెళ్లిన విషయం తెలిసిందే. 


logo