శనివారం 04 జూలై 2020
National - May 25, 2020 , 13:31:18

విమానాల్లో మిడిల్ సీట్ల‌ను ఖాళీగా ఉంచండి : సుప్రీంకోర్టు

విమానాల్లో మిడిల్ సీట్ల‌ను ఖాళీగా ఉంచండి :  సుప్రీంకోర్టు


హైద‌రాబాద్‌:  విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా వెనక్కి తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విమానాల్లో ఉన్న మ‌ధ్య సీట్ల‌ను ఖాళీగా ఉంచాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టాన్సింగ్ త‌ప్ప‌నిస‌రి అని కోర్టు తెలిపింది. జూన్ ఆర‌వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఎయిర్ ఇండియా విమానాల్లో మిడిల్ సీటుకు బుకింగ్ సౌక‌ర్యం ఉంటుంద‌న్నారు.  విమాన సంస్థ‌ల బాగోగుల క‌న్నా.. ప్ర‌యాణికుల ఆరోగ్యం గురించి ప్ర‌భుత్వాలు ఆందోళ‌న చెందాల‌ని సుప్రీం త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డింది.  బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఆరు ఫీట్ల దూరం ఉండాలంటున్నారు, మ‌రి విమానాల్లో ఈ భౌతిక దూరాన్ని ఎందుకు పాటించ‌డంలేద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బాబ్డే త‌న తీర్పులో  ప్ర‌శ్నించారు.


logo