శనివారం 30 మే 2020
National - Apr 10, 2020 , 20:10:28

కచ్చితమైన మార్గదర్శకాలను నిర్దేశించండి..

కచ్చితమైన మార్గదర్శకాలను నిర్దేశించండి..

న్యూఢిల్లీ: ఈ నెలలో కొన్ని ఉత్సవాల దృష్టా లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా నిర్దేశించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ కోరింది. ఆయా నియమాలను కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ ఆదేశించారు. వివిధ రాష్ర్టాల నుంచి అందిన సమాచారం ప్రకారం లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కూలీలు, అనాథల కోసం 37,978 శిభిరాలు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 34వేల కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతుండగా, 3,900కు పైగా కేంద్రాలను వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయని తెలిపారు. అదేవిధంగా 26,225 ఆహార కేంద్రాలు నడుస్తున్నాయని, వీటిద్వారా సుమారు కోటి మందికి ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇందులో 14,799 ఆహార కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు, 11,426 కేంద్రాలను ఎన్‌జీవోలు నిర్వహిస్తున్నాయన్నారు. సుమారు 16.5 లక్షల కార్మికులకు వారు పనిచేసే కంపెనీలు, పరిశ్రమలు ఆశ్రయం కల్పించడంతోపాటు ఆహారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. 


logo