శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 27, 2021 , 19:31:53

అన్‌లాక్‌ : తెరుచుకోనున్న స్విమ్మింగ్‌ పూల్స్‌

అన్‌లాక్‌ : తెరుచుకోనున్న స్విమ్మింగ్‌ పూల్స్‌

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇక కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతించనుంది .తాజాగా జారీ చేసిన అన్‌లాక్‌ మార్గదర్శకాల్లో  దేశవ్యాప్తంగా స్విమ్మింగ్‌ పూల్స్‌ను తెరిచేందుకు అనుమతించింది. థియేటర్లలో సీటింగ్‌ సామర్థ్యం పెంచుకునేందుకూ ఆదేశాలు జారీ చేసింది. 

గతంలో 50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్లను అనుమతించిన ప్రభుత్వం తాజాగా  సీట్ల సామర్థ్యం పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది.. కొవిడ్‌-19 కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతుండటంతో లాక్‌డౌన్‌ నిబంధనలను భారీగా సడలించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 

VIDEOS

logo