గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 15:05:26

సెల్ఫ్ ఐసోలేష‌న్‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

సెల్ఫ్ ఐసోలేష‌న్‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

హైద‌రాబాద్‌: ఇంట్లోనే ఉండాల‌నుకుంటున్న వైర‌స్ పేషెంట్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది.  సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 17 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డిన 17 రోజుల వర‌కు క్వారెంటైన్‌లో ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇంకా ప‌ది రోజుల పాటు జ్వ‌రం కూడా రాకూడ‌ద‌న్న నియ‌మాన్ని పేర్కొన్న‌ది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ఉన్న‌వారు.. ఐసోలేష‌న్ గ‌డువు ముగిసిన త‌ర్వాత‌.. క‌చ్చితంగా మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ది. 

ఇంట్లో స్వీయ నియంత్ర‌ణ‌లో ఉన్న పేషెంట్లు.. త‌మ జిల్లా నిఘా అధికారికి ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య ప‌రిస్థితిపై స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది.  క‌రోనా పేషెంట్‌కు చికిత్స అందిస్తున్న వారు కానీ లేక వారికి సేవ చేస్తున్న వారు కానీ క‌చ్చితంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్ర‌లు తీసుకోవాల‌ని సూచించింది.logo