ఆదివారం 07 జూన్ 2020
National - Apr 04, 2020 , 11:20:20

డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌రోనాపై అవ‌గాహ‌న : మ‌ంత్రి శైల‌జ‌

డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌రోనాపై అవ‌గాహ‌న : మ‌ంత్రి శైల‌జ‌

ఆమె పేరు డాక్ట‌ర్ మిథిల్ దేవికా. పేరుగాంచిన డ్యాన్స‌ర్‌. కేర‌ళ‌కు చెందిన ఈమె మోహినియ‌ట్టం అనే ప్ర‌ద‌ర్శ‌న ద్వారా ప్ర‌జ‌ల‌కు క‌రోనాపై అవగాహ‌న క‌ల్పిస్తున్న‌ది. ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఇప్పుడిది వైర‌ల్‌గా మారింది. ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన ఈమె ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను కొవిడ్‌-19 నుంచి కాపాడాల‌నుకున్న‌ది. అందుకు మ‌ల‌యాళంలో స‌రికొత్త పాట‌కు త‌నే స్వ‌యంగా కొరియోగ్ర‌ఫీ చేసుకున్న‌ది. ఈ వీడియో చూసిన‌ కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి కె.కె. శైల‌జ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలుపుతూ దేవిక‌ను ప్రోత్స‌హించిన‌ది. 

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో క‌రోనా వైర‌స్‌ను ఒక దెయ్యంలా చూపించింది దేవిక‌. ఒక వ్య‌క్తి నుంచి మ‌రొక వ్య‌క్తికి వైర‌స్ ఎలా సోకుతుందో తెలియ‌జేసింది. అంతేకాకుండా క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను డ్యాన్స్ ద్వారా తెలియ‌జేసింది దేవిక‌. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోకు 59 వేలమంది వీక్షించారు. మంచి పాట ఎంచుకున్నారు. కొరియోగ్ర‌ఫీ బాగుంది. స‌మాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు. నాట్యంతోపాటు అంద‌రినీ మొటివేట్ చేశారు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


logo