మంగళవారం 07 జూలై 2020
National - Jun 21, 2020 , 01:25:01

రాజస్థాన్‌లో ఉల్క కలకలం

రాజస్థాన్‌లో ఉల్క కలకలం

జైపూర్‌: అత్యంత వేగంగా, పొగలు కక్కుతూ నేలపై పడిందో వస్తువు.. అలా పడిందో లేదో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు డభేల్‌ అని శబ్దం వినిపించింది.. చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబు దాడి జరుగుతోందా అని పరేషాన్‌ అయ్యారు. దగ్గరికి వెళ్తే గానీ తెలియలేదు.. అది బాంబు కాదని. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఉల్కను పోలిన శకలం ఆకాశం నుంచి అక్కడి సంచోర్‌ పట్టణంలో ఊడిపడింది. దాదాపు 2.78 కిలోల బరువున్న ఆ శకలాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షకు పంపగా.. జెర్మీనియం, ప్లాటినం, నికెల్‌, ఇనుముతో కూడిన లోహపు ముద్ద అని తేలింది. అయితే, ఇది ఆకాశం నుంచి ఊడిపడిందా లేదా అన్నది తెలుసుకొనేందుకు భూగోళ శాస్త్రవేత్తలకు సమాచారమిచ్చారు.logo