బుధవారం 08 జూలై 2020
National - Jun 20, 2020 , 17:51:16

ఆకాశం నుంచి రాలి ప‌డిన వింతైన వ‌స్తువు!

ఆకాశం నుంచి రాలి ప‌డిన వింతైన వ‌స్తువు!

ఆకాశం నుంచి వ‌డ‌గండ్లు ప‌డినట్లు పొగ‌లు క‌క్కుతూ ఓ వింత వ‌స్తువు భూమి మీద ప‌డింది. లోహంలా మిల‌మిల మెరిసిపోతున్న ఈ వ‌స్తువును చూసి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్న ఈ త‌రుణంలోనే ఇలా ఎన్నో వింత‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జ‌లోర్ జిల్లాలో చ‌ర్చ‌నీయంగా మారింది.

సాంచోర్‌లోని గాయ‌త్రి కాలేజీ స‌మీపంలో ఈ వింత వ‌స్తువు ప‌డింది. ఇది చూడ్డానికి 2.8 కిలోల బ‌రువుందంటున్నారు. ఇది అచ్చం లోహ‌పు ముద్ద‌లా ఉంది. అత్యంత వేగంతో ఆకాశం నుంచి భూమి మీద ప‌డ‌డంతో సుమారు నాలుగు అడుగుల లోతులోకి పూరుకుపోయింది. దాన్నిముట్టుకుంటే నిప్పు ప‌ట్టుకున్న‌ట్లు అనిపించింద‌ని స్థానికులు వాపోయారు. ఇలాంటి లోహాన్ని ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌క‌పోవ‌డంతో వెంట‌నే అధికారుల‌కు తెలిపారు. స‌మాచారం తెలియ‌గానే అధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని వ‌స్తువును స్వాధీనం చేసుకున్నారు. సాధార‌ణంగా గ్ర‌హ శ‌క‌లాలు భూ వాతావ‌ర‌ణంలోకి రాగానే క‌లిపోవ‌డ‌మో లేదా గాల్లోనే క‌రిగిపోవ‌డ‌మో జ‌రుగుతాయి. దీని విష‌యంలో అలా జ‌రుగ‌లేదు. దీని గురించి తెలుసుకోవ‌డానికి అధికారులు ప‌రిశోధ‌న‌ల‌కు త‌ర‌లించారు. 


  


logo