శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 15:01:22

మంత్రి చేతుల్లోంచి ఫోన్‌ లాక్కెళ్లారు..

మంత్రి చేతుల్లోంచి ఫోన్‌ లాక్కెళ్లారు..

హైదరాబాద్‌ : పుదుచ్చేరికి చెందిన మంత్రి మొబైల్‌ ఫోన్‌ను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న బీచ్‌లో చోటు చేసుకుంది. విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌. కమలాకన్నన్‌ సోమవారం రాత్రి బీచ్‌లో వాకింగ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. మంత్రి చేతుల్లో ఉన్న ఫోన్‌ను లాక్కెళ్లారు. ఆ తర్వాత తన నివాసానికి చేరుకున్న మంత్రి.. వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బీచ్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 


logo