శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 12:09:53

టెన్త్‌ పరీక్షల్లో చీటీల జోరు.. వీడియో

టెన్త్‌ పరీక్షల్లో చీటీల జోరు.. వీడియో

ముంబయి : మహారాష్ట్రలో పదో తరగతి వార్షిక ప్రారంభమయ్యాయి. యవత్మాల్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో చీటీల జోరు కొనసాగుతోంది. పాఠశాల ప్రహరీ గోడ ఎక్కి కిటికీల ద్వారా విద్యార్థులకు చీటీలు విసిరేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం కంట్రోలర్‌ ఏఎస్‌ చౌదరిని ప్రశ్నించగా.. ప్రహరీ గోడకు ఫెన్సింగ్‌ విషయమై పలు సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రహరీ గోడను పూర్తిగా నిర్మించలేదు అని కంట్రోలర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రతను పెంచాలని పోలీసులను పలుమార్లు కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చౌదరి స్పష్టం చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


logo