సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 11:11:12

క‌రోనాపై అవ‌గాహ‌న‌కు హిజ్రాల జాన‌ప‌ద‌ నృత్యం.. వీడియో

క‌రోనాపై అవ‌గాహ‌న‌కు హిజ్రాల జాన‌ప‌ద‌ నృత్యం.. వీడియో

చెన్నై: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఎన్నో దేశాలు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి. అయినా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. దీంతో ప‌లు ప్రాంతాల్లో ఎవ‌రికి తోచిన‌ట్లు వారు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రం చెన్నైలోని మురికివాడ‌ల ప్ర‌జ‌ల‌కు హిజ్రాలు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించారు. కోలాటం త‌దిత‌ర జాన‌ప‌ద నృత్యాలు చేస్తూ క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ప్ర‌చారం చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.                                          

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo