సోమవారం 06 జూలై 2020
National - Jun 22, 2020 , 15:55:10

చైనా వస్తువులను దహనం చేసిన వ్యాపారులు

చైనా వస్తువులను దహనం చేసిన వ్యాపారులు

న్యూఢిల్లీ: అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ)కి చెందిన కొందరు చైనా వస్తువులను దహనం చేశారు. లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా సోమవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో సీఏఐటీ వ్యాపారులు చైనా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువులను దహనం చేశారు.

వ్యాపారులు ఈ సందర్భంగా  చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా వస్తువుల దిగుమతిని నిలిపివేస్తామని వారు పేర్కొన్నారు. 2021 డిసెంబర్‌ నాటికి రూ. లక్ష కోట్ల విలువైన చైనా వస్తువుల దిగుమతిని తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. logo