బుధవారం 27 జనవరి 2021
National - Jan 10, 2021 , 11:03:01

త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాలి.. చెన్నైలో అభిమానుల భారీ ప్ర‌ద‌ర్శ‌న‌

త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాలి.. చెన్నైలో అభిమానుల భారీ ప్ర‌ద‌ర్శ‌న‌

చెన్నై: త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నానంటూ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వారు కోరారు. చెన్నైలోని వ‌ళ్లువార్ కొట్ట‌మ్‌లో జ‌రిగిన ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వంద‌లాది మంది ర‌జినీకాంత్ అభిమానులు పాల్గొన్నారు. మ‌రికొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌థ్యంలో ర‌జినీకాంత్ గ‌త డిసెంబ‌ర్‌లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. 

అయితే ఆ త‌ర్వాత కొద్ది రోజులకే ఆయ‌న స్వ‌ల్ప అనాగ్యానికి గురై కోలుకున్నారు. కానీ, అనారోగ్యం కార‌ణంగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న త‌మ ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo