మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 13:06:23

హ్యాపినెస్ క్లాస్ లో మెలానియా

హ్యాపినెస్ క్లాస్ లో మెలానియా

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌.. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్‌ మోతిబాగ్‌ ఏరియాలోని సర్వోదయ కో-ఎడ్యుకేషనల్‌ సెకండరీ స్కూల్‌ను సందర్శించిన మెలానియాకు ఆ స్కూల్‌ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మెలానియాకు చిన్నారులు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. హ్యాపినెస్‌ క్లాస్‌రూమ్‌ విద్యార్థులతో మెలానియా ముచ్చటించారు. మెలానియా సందర్శన నేపథ్యంలో స్కూల్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హ్యాపినెస్‌ క్లాస్‌రూమ్‌ అంటే..

రెండేళ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం హ్యాపినెస్‌ కరిక్యూలమ్‌ను రూపొందించింది. ఈ కరిక్యూలమ్‌ను నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తారు. అయితే దీని ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, స్వీయ అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించేలా పాఠ్యాంశాలు బోధిస్తారు. తీవ్ర ఒత్తిడి ఉన్న సమయాల్లో కూడా తమకు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి.. ప్రశాంతత పొందడమే ఈ కరిక్యూలమ్‌ ఉద్దేశం. 

ఇది గొప్పదినం : కేజ్రీవాల్

హ్యాపినెస్ క్లాస్ రూమ్ ను అమెరికా ప్రథమ మహిళ మెలానియా సందర్శించడం సంతోషకరమైన విషయమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. టీచర్లు, విద్యార్థులు, ఢిల్లీ ప్రజలకు ఇది గొప్పదినం అని పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి ప్రపంచ దేశాలకు భారత్ ఆధ్యాత్మికను నేర్పింది. ఇక్కడి స్కూళ్ల నుంచి హ్యాపినెస్ పాఠాల సారాంశాన్ని ఆమె తమ స్వదేశానికి తీసుకెళ్లుందని ఆశిస్తున్నానని కేజ్రీవాల్ ట్వీట్లో తెలిపారు.logo
>>>>>>