బుధవారం 20 జనవరి 2021
National - Dec 23, 2020 , 16:44:25

ఆ ఆర్టిక‌ల్ పునరుద్ధ‌రించే వ‌ర‌కూ పోటీ చేయ‌ను!

ఆ ఆర్టిక‌ల్ పునరుద్ధ‌రించే వ‌ర‌కూ పోటీ చేయ‌ను!

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని పున‌రుద్ధ‌రించే వ‌ర‌కూ తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని అన్నారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ. స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలపై ఆమె సంతృప్తి వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే జ‌మ్ముక‌శ్మీర్ సొంత రాజ్యాంగాన్ని తిరిగి తీసుకొచ్చే వ‌ర‌కూ, ఆర్టిక‌ల్ 370ని పున‌రుద్ధ‌రించే వ‌ర‌కూ నేను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మెహ‌బూబా స్పష్టం చేశారు. గుప్కార్ కూట‌మిలో త‌మ ప్ర‌త్య‌ర్థి నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ కూడా ఉండ‌టంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అన్న విష‌యంలో విభేదాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా అని ప్ర‌శ్నించ‌గా.. తాము ప్ర‌త్యర్థులమే అయినా జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌యోజ‌నాల కోసం చేతులు క‌లిపామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌డం లేద‌ని, తాము కోల్పోయిన దానిని తిరిగి పొంద‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మెహ‌బూబా తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విష‌యంపై తాము చ‌ర్చిస్తామ‌ని, తానైతే సీఎం అభ్య‌ర్థి రేసులో లేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న తండ్రి ముఫ్తీ మొహ‌మ్మ‌ద్ సయీద్ బీజేపీతో చేతులు క‌ల‌ప‌డాన్ని కూడా ఆమె స‌మ‌ర్థించారు. 


logo