మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 13:58:00

ల్యాండ్‌ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ

ల్యాండ్‌ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్లో ల్యాండ్‌ మాఫియా ఆగడాలు నానాటికి మితిమీరిపోతున్నాయని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. ల్యాండ్‌ మాఫియా చెలరేగిపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫలితంగా అక్కడి మైనార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. శనివారం ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా మీడియాకు తెలిపారు. 

జమ్ముకశ్మీర్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ వారు చెప్పినట్లుగా చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ప్రజలను విడదీసి అధికారులే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్లో ల్యాండ్‌ మాఫియా పెట్రేగిపోతున్నా పట్టించుకోవడం లేదని, వీరి కారణంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. ల్యాండ్‌ మాఫియాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. మైనార్టీలకు పనిష్మెంట్‌ ఇవ్వడం వింతగా ఉన్నదని తెలిపారు. జమ్ములోని ముస్లిం ఆధిపత్యం అధికంగా ఉన్న ప్రాంతంలో ల్యాండ్‌ మాఫియా వేళ్లూనికునిపోతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కూడా ల్యాండ్ మాఫియాకే వంత పాడటం వల్ల మైనార్టీలు నష్టపోతున్నారని, ఇకనైనా ల్యాండ్‌ మాఫియాలను అదుపులో పెట్టాలని మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి..

ఇది అత్యత్తమ పోలీస్‌ శిక్షణ కళాశాల

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo