బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 11:37:30

‘ది ఖాకీ వైబ్స్’‌..డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ సాంగ్‌ వీడియో

‘ది ఖాకీ వైబ్స్’‌..డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ సాంగ్‌ వీడియో

మేఘాలయ: ఏటా పెద్ద సంఖ్యలో యువత డ్రగ్స్‌ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. సమాజాన్ని పెడదోవ పట్టిస్తోన్న డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందకు కేంద్రప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు రాష్ర్టాల అధికారులు..అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను చేపడుతుంటారు. మేఘాలయ పోలీసులు సరికొత్తగా చేపట్టిన యాంటీ డ్రగ్‌ క్యాంపెయిన్‌ ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆంగ్ల గాయకుడు జాన్‌ లెన్నన్స్‌ పాటల్లో ప్రాచుర్యం పొందిన ఇమాజిన్‌ ఆంథమ్‌ను మేఘాలయ పోలీసుల బృందం ఆలపిస్తూ డ్రగ్స్‌ వాడకాన్ని తగ్గించేలా పాట పాడి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.

ప్రజలు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా, శుద్ధమైన వాతావరణంలో నివసించేలా  ది ఖాకీ వైబ్స్‌ పోలీస్‌ గ్రూప్‌ పాడిన ఈ పాట ఇపుడు సోషల్‌మీడియాలో వైలర్‌ అవుతోంది. జూన్‌ 26న అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యతిరేకదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐపీఎస్‌, డీజీపీ ఆర్‌ చంద్రకాంత్‌ నేతృత్వంలో పాడిన డ్రగ్స్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ వీడియో సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 1600 సార్లు ఈ వీడియో షేర్‌ అయింది. logo