శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 15:52:47

మేఘాలయలో పర్యాటక ప్రదేశాల మూసివేత

మేఘాలయలో పర్యాటక ప్రదేశాల మూసివేత

షిల్లాంగ్‌ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో దాన్ని అడ్డుకోవటానికి కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసే దిశగా మేఘాలయలో అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఆ తరువాత అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని మేఘాలయ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశంలోని పర్యాటకులు మేఘాలయ టూర్‌ను రద్దు చేసుకోవాలని కోరింది.  మేఘాలయ, షిల్లాంగ్‌లతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను పర్యటించదల్చుకున్నవారు తమ షెడ్యూల్‌లో మార్పులు చేసుకోవాలని సూచించింది.


logo