శనివారం 11 జూలై 2020
National - Jun 14, 2020 , 17:32:41

మేఘాలయలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు!

మేఘాలయలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు!

షిల్లాంగ్‌: కరోనాను అరికట్టేందుకు మేఘాలయ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. అలాగే, ప్రజల అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వైద్య సంబంధిత, ఇతర అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. రేపటి నుంచి 22 వ తేదీ వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

   కరోనాను అరికట్టేందుకు మార్చిలో లాక్‌డౌన్‌ విధించడంతోపాటు కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. దశలవారీగా దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. కాగా, మేఘాలయ రాష్ట్రంలో ఇప్పటివరకు 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఒకరు మృతిచెందగా, 26 మంది కోలుకున్నారు.logo