ఆదివారం 31 మే 2020
National - May 23, 2020 , 12:47:26

గిటార్ వాయించిన మేఘాల‌యా సీఎం

గిటార్ వాయించిన మేఘాల‌యా సీఎం

హైద‌రాబాద్‌: మేఘాల‌యా సీఎం కాన్‌రాడ్ సంగ్మా త‌న‌లో దాగిన సంగీత క‌ళ‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.  ఎల‌క్ట్రిక్ గిటార్‌పై కొన్ని బాణీలు వినిపించిన ఆయ‌న రాక్‌స్టార్‌లా మారారు. బిజీ బిజీ అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత‌.. సీఎం సంగ్మా సేద తీరేందుకు త‌న ఎల‌క్ట్రిక్ గిటార్‌కు ప‌నిపెట్టారు. ఐర‌న్ మైడెన్ బ్యాండ్‌కు సంబంధించిన వేస్టెడ్ ఇయ‌ర్స్ ట్యూన్‌ని వినిపించారాయ‌న‌.  1986లో రిలీజైన స‌మ్‌వేర్ ఇన్ టైమ్ ఆల్బ‌మ్‌లోని పాట‌ను త‌న గిటార్‌తో వాయించారు.  సీఎం త‌న గిటార్ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గానే దాన్ని కొన్ని గంట‌ల్లోనే సుమారు 3 ల‌క్ష‌ల మంది చూశారు. logo