శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 11:42:14

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ప్రారంభం

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ప్రారంభ‌మైంది. పార్టీకి శాశ్వత అధ్య‌క్షుడి ఎన్నికే ప్ర‌ధాన అంశంగా ఈ స‌మావేశం జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది. అదేవిధంగా పార్టీలో సంస్థాగత ఎన్నికల, ఏఐసీసీ ప్లీనరి సమావేశాల షెడ్యూల్ ఖ‌రారు త‌దిత‌ర అంశాల‌పై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల అథారిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వ‌హించేందుకు తాము సిద్ధమేనని సోనియాకు తెలుపడంతోపాటు పలు సిఫారసులు చేసిందని కాంగ్రెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ మేరకు ఆయా అంశాల‌పై చ‌ర్చించ‌డం కోసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్న‌ది. 

కాగా, కాంగ్రెస్ కోర్ క‌మిటీగా భావించే సీడ‌బ్ల్యూసీ సమావేశం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జరుగుతున్న‌ది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంతా పార్టీ అధ్యక్ష పదవితోపాటు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆశాజ‌న‌క ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి సోనియాగాంధీ తాత్కాలిక‌ అధ్యక్షురాలిగా కొన‌సాగుతున్నారు. అయితే, పార్టీకి పూర్వవైభవం తేవాలంటే పూర్తికాల అధ్యక్షుడిని నియమించడంతోపాటు సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని ముఖ్య నేతలు డిమాండ్ చేస్తుండ‌టంతో తాజా స‌మావేశంలో వాటిపై చ‌ర్చిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo