మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 00:43:10

15 మందికి ‘నారీ శక్తి’ అవార్డులు

15 మందికి ‘నారీ శక్తి’ అవార్డులు
  • మహిళా దినోత్సవం సందర్భంగా అందజేసిన రాష్ట్రపతి కోవింద్‌

న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు కృషి చేసిన 15 మంది మహిళలు నారీ శక్తి అవార్డులు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి కోవింద్‌ వీరికి ఈ అవార్డులను అందజేశారు. చండీగఢ్‌ ‘అద్భుత మహిళ’, 103 ఏండ్ల మన్‌ కౌర్‌ వందేండ్లు దాటిన ప్రపంచ పరుగుల రాణిగా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి పోడుభూముల సాగుతో గిరిజన మహిళలకు చేయూతనిస్తున్నారు. జార్ఖండ్‌ ‘మహిళా టార్జన్‌'చమి ముర్ము పర్యావరణ హితానికి కృషిచేస్తున్నారు. నిల్జా వాంగ్మో సంప్రదాయ లడక్‌ వంటకాల్లో శిక్షణ ఇస్తున్నారు. 


రష్మిఉర్ధర్ధే ఆటోమోటివ్‌పరిశోధనల్లో రాణించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన తషి, నుమ్గి మాలిక్‌ ఎవరెస్ట్‌ వంటి పర్వతాలు అధిరోహించిన తొలి మహిళాకవలలుగా ఖ్యాతిపొందారు. కౌషికి చక్రవర్తి భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఎనలేని కృషిచేశారు. తొలి మహిళా ఫైటర్‌ పైలట్లు అవని చతుర్వేది, భావనా కాంత్‌, మోహన సింగ్‌, మలివయసులో చదువుకున్న కేరళకు చెందిన భగీరథీ అమ్మ (105), కర్త్యాయిని అమ్మ (98), కశ్మీర్‌కు చెందిన ఆరిఫా జాన్‌ కూడా అవార్డులు అందుకున్నారు.  


logo