గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 13:03:31

క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుండా 16 మంది కుటుంబ స‌భ్యుల‌కు పాజిటివ్

క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుండా 16 మంది కుటుంబ స‌భ్యుల‌కు పాజిటివ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌:  రాష్ట్రంలోని మొరాదాబాద్ నుంచి వ‌చ్చిన ఓ కుటుంబంలోని వారంద‌రికీ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ కుటుంబంలోని 2 సంవ‌త్స‌రాల పిల్ల‌ల నుంచి 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు మొత్తం 16 మందికి క‌రోనా మ‌హ‌మ్మారి సోకింది. కాని వారెవ‌రికీ అనారోగ్య ల‌క్ష‌ణాలు లేవు. సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే వామిఖ్‌ ఖాన్ అనే వ్య‌క్తి సోద‌రుడు క‌లిసిన వ్య‌క్తికి క‌రోనా వ‌చ్చింద‌ని, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు‌ ఖాన్ సోద‌రుడికి ఏప్రిల్ 10వ తేదీన‌ కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 టెస్ట్ రిజ‌ల్ట్ పాజిటివ్ రావ‌డంతో ఖాన్ ఇంటికి 40 మంది పోలీసులు, అధికారులు చేరుకున్నారు. ఆ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుంటూ ఖాన్ పెద్ద ఎత్తున పోలీసులు రావ‌డంతో ఇంట్లో వాళ్ల‌మంతా భ‌య‌ప‌డిపోయాం. నా ఇల్లు పోలీస్‌స్ట‌ష‌న్‌గా మారిపోయింది. కాల‌నీ మొత్తం భ‌యాందోళ‌న‌కు గురైంది. మాకు ప్ర‌భుత్వ అధికారుల ప‌ట్ల గౌర‌వం ఉంది కాబ‌ట్టి వారికి స‌హ‌క‌రించాం మా కుటుంబంలోని మొత్తం 16 మందిని ఏప్రిల్ 14వ తేదీన మొరాదాబాద్ న‌గ‌రంలోని ఐఎఫ్‌టీఎమ్ విశ్వ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన‌ క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

 ప్ర‌తీ గ‌దికి ఇద్ద‌రు చొప్పున ఎనిమ‌ది గ‌దుల్లో మ‌మ్ముల‌ను ఉంచారు. ఆరోగ్య‌శాఖ నిబంధ‌న‌లు అనుస‌రించి క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మాత్ర‌మే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. మా కుటుంబంలో ఎవ‌రికీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు.  నాలుగు రోజుల అనంత‌రం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అంద‌రికీ వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కుటుంబంలోని అంద‌రికీ పాజిటీవ్ అని తేలింది. ఫ‌లితాల ఆధారంగా మా అంద‌రినీ తీర్థంక‌ర్ మ‌హావీర్ విశ్వ‌విద్యాల‌యంలోని ఐసోలేష‌న్ వార్డుల్లోకి త‌ర‌లించారు. చికిత్స అందిస్తున్న‌ప్పుకు కాని, అంత‌కు ముందు కాని మాకు ఎవ‌రికీ అనారోగ్య ల‌క్ష‌ణాలు లేవు. ఈ విష‌యం డాక్ట‌ర్ల‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఏడు రోజుల చికిత్స అనంత‌రం ఒక్కొక్క‌రికీ నెగిటివ్ రావ‌డం ప్రారంభ‌మైంది. మూడు సార్లు ప‌రీక్ష నిర్వ‌హించిన అనంత‌రం నెగిటివ్ రావ‌డంతో అంద‌రినీ మే 1వ తేదీన ఇంటికి పంపించార‌ని తెలిపారు. 

ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ల్యాబ్ మెడిసిన్ విభాగంలో డాక్ట‌ర్ రాజీవ్ రంజ‌న్ మాట్లాడుతూ... రోగికి వైర‌స్ సోకిన‌ప్పుడు ద‌గ్గు, జ్వ‌రం, త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు ఉండాల‌ని కానీ వీరికి ఎటువంటి ల‌క్ష‌ణాలు లేవు. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల ఇలా జ‌రిగి ఉండ‌వ‌చ్చు. దీనిపై అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇటువంటి కేసులు ఇంకా రావ‌చ్చొని అనుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. 

వామిఖ్‌ఖాన్ మాట్లాడుతూ... క‌రోనా వైర‌స్ గురించి ఆందోళ‌న చెంద‌వ‌ద్దు భ‌య‌ప‌డొద్దు.. జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. వైద్యులు, సిబ్బంది మంచి చికిత్స అందించారు. వారంద‌రికీ మా కుటుంబ స‌భ్యుల అంద‌రి త‌ర‌పున‌ కృత‌జ్ఞ‌త‌లు. ఎవ‌రైనా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని క‌లిసినా, వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నా దాచి పెట్ట‌కుండా పరీక్ష‌లు చేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప‌రీక్ష‌లు చేయించుకుంటే మ‌న ప్రాణాలే కాకుండా ప‌క్క‌వారి ప్రాణాల‌ను కాపాడి దేశానికి, మ‌న ప్రాంతానికి సేవ చేసిన వార‌మ‌వుతామ‌ని ఖాన్ పిలుపునిచ్చారు.  


logo