శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 29, 2020 , 12:28:55

అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌కరిస్తున్న అంబులెన్స్ డ్రైవ‌ర్

అంత్య‌క్రియ‌ల‌కు స‌హ‌కరిస్తున్న అంబులెన్స్ డ్రైవ‌ర్

శ్రీన‌గ‌ర్ : కొవిడ్‌తో చ‌నిపోయిన వారి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనేందుకు వారి కుటుంబ స‌భ్యులు కూడా ధైర్యం చేయ‌డం లేదు. త‌మ‌కెక్క‌డ క‌రోనా సోకుతుందో అనే భ‌యంతో. కానీ ఓ అంబులెన్స్ డ్రైవ‌ర్ మాన‌వత్వంతో మెలుగుతున్నాడు. కుటుంబ స‌భ్యులు తీసుకెళ్ల‌ని కొవిడ్ రోగుల మృత‌దేహాల అంత్య‌క్రియ‌ల్లో ఈ డ్రైవ‌ర్ పాల్గొని సిబ్బందికి స‌హాయం చేస్తున్నాడు. 

జ‌మీల్ అహ్మ‌ద్ అనే వ్య‌క్తి శ్రీన‌గ‌ర్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఇత‌ను ఇప్ప‌టికే వేలాది మంది క‌రోనా రోగుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించాడు. అదే క్ర‌మంలో క‌రోనాతో చ‌నిపోయిన వారి మృత‌దేహాల‌ను కూడా స్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించి.. అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటున్నాడు. 85 మంది అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న‌ట్లు అహ్మ‌ద్ తెలిపాడు.   

అంబులెన్స్ సైర‌న్ మోగ‌గానే గుంత‌లు తవ్వ‌కుండానే కొంద‌రు పారిపోతున్నారు. అసంపూర్తిగా ఉన్న గుంత‌ల‌ను తానే త‌వ్వి.. అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేస్తున్న‌ట్లు అహ్మ‌ద్ చెప్పాడు. క‌రోనా భ‌యంతోనే అంద‌రూ దూరంగా ఉంటున్నార‌ని పేర్కొన్నాడు. తాను చేస్తున్న ప‌నికి దేవుడు ప్ర‌తిఫ‌లం అందిస్తాడ‌ని జ‌మీల్ తెలిపాడు. 

అల్లా ద‌య‌తోనే తాను ఈ ప‌నుల‌న్నీ చేస్తున్నాన‌ని వివ‌రించాడు. త‌న కుటుంబానికి ఎలాంటి క‌రోనా సోక‌లేద‌ని పేర్కొన్నాడు. త‌న‌కు తానే బంధువుల‌ను, స్నేహితుల‌ను క‌ల‌వ‌డం మానేశాన‌ని అహ్మ‌ద్ చెప్పాడు. 


logo